ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : ఏఐఎంఐఎం శాసనసభ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాత నగరంలోని ఓ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఓ సభలో తనను తన అన్నను విషమిచ్చి చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సభముఖంగా పేర్కొన్నారు. తమను పాయాసంలోను, రసంలోను విషం కలిపి చంపేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేశారు. చికిత్స పేరా తమను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ అక్కడ చంపే ప్రయత్నాలు కూడా చేయకపోవచ్చునని పేర్కొన్నారు. తన అన్నయ్య హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తనకు ప్రాణాపాయం లేకపోలేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా హైదరాబాద్ తామే విజయం సాధిస్తామని.. ఏఐఎంఐఎం ను ఓడించే వాడు ఇంకా పుట్టలేదని ఆయన ఈ సందర్భంగా ఆవేశపూరితంగా ఉద్ఘాటించారు. ఆయన మాట్లాడుతున్న సేపు సభ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారడం విశేషం.