పైలెట్ మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
రతన్ గఢ్, జూలై 9: రాజస్థాన్ చురూ జిల్లా రతన్ గఢ్ సమీపంలో భానుదా గ్రామం వద్ద భారత వైమానిక దళానికి చెందిన విమానం బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ మృతిచెందినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గతంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద 2024 మార్చి 12న భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ ప్రాణాలతో బయటపడ్డారు.
అదే విధంగా 2021 డిసెంబర్ 24న ఇదే జైసల్మేర్ కు సమీపంలో వాయు సేనకు సంబంధించిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించారు.