ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అల్-ఖైదా యెమెన్ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతి చెందినట్లు ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే అతడి మరణానికి గల కారణాలను వెల్లడించలేదు. అల్-ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూప్‌గా యెమెన్ శాఖ అవతరించింది. ఇతడిపై అమెరికా గతంలో దాదాపు రూ.40 కోట్ల రివార్డు ప్రకటించింది. సౌదీలో పుట్టిన బటర్ఫీ 1999లో అఫ్గానిస్తాన్‌కు మకాం మార్చి, 2010లో అల్-ఖైదాలో చేరాడు.