Dana Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇవాళ తీవ్ర తుపానుగా రూపాంతరంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. తీరం వెంబడి 80 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.