Trending Now

Heavy Rains: అలర్ట్.. తెలంగాణలో అతిభారీ వర్షాలు!

Heavy Rain Alert For Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్యదిశగా పయనించి రాబోయే 3 గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది.

రానున్న 24 గంటల్లో ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇక, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

Spread the love

Related News

Latest News