Trending Now

‘డబుల్ బెడ్ రూమ్‌లను మంజూరు చేయండి’.. కలెక్టర్‌కు వినతి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుపేద కుటుంబాల వారిని గుర్తించి వెంటనే డబుల్ బెడ్ రూమ్‌లో మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎం సయ్యద్ మహమూద్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎంతో మంది అర్హులైన నిరుపేదలు రాష్ట్ర ప్రభుత్వం పంపించేసిన డబుల్ బెడ్ డబుల్ బెడ్ రూమ్‌లకు అర్హులైనవారు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోకుండా రాజకీయ జోక్యంతో అనర్హులైన వారికే డబుల్ బెడ్ రూంలను గత ప్రభుత్వాలు అందజేయడం జరిగిందని చెప్పారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి ప్రాంతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వారికి కనీస సౌకర్యాలు కొరవడ్డాయని ఆరోపించారు. స్థానికంగా పారిశుధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విద్యుత్ సమస్యలు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. అర్హులైన వారిని డబుల్ బెడ్ రూంలను కేటాయించిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వారికి సంబంధిత అర్హత ధ్రువీకరణ పత్రాలను అందజేయకపోవడం శోచనీయమన్నారు. ఎల్లపల్లి, మహాలక్ష్మి వాడలలో ఉన్న డబల్ బెడ్ రూంల వాసులందరికీ తగిన విధంగా మౌలిక వసతులను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలను చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News