ప్రతిపక్షం, దుబ్బాక, జులై 4: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు విప్లవ పంథాను ఎన్నుకున్నారని తెలిపారు.మన్యంలో బ్రిటీషు వారి దోపిడీని ఎదుర్కొని, గిరిజనులకు అండగా నిలిచి వారిని ఎంతగానో చైతన్యపర్చారన్నారు.ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఆయన ఢీ కొన్నారన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు బ్రిటీషు వారితో అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు బ్రిటీషువారి తూటాలకు నేలకొరిగాడన్నారు. అల్లూరి సీతారామ రాజు నేడు భౌతికంగా మన మధ్యలేనప్పటికీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన బాటలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్. పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తునికి సురేష్, రైతు నాయకులు మల్లు గారి రామచంద్ర రెడ్డి, మంచే కృష్ణ, కడవేరుగు గోపి తదితరులు పాల్గొన్నారు.