ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందిస్తున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాన్ గల్లి ప్రాంతానికి చెందిన అల్మాస్ ఖాన్‌కు యువజన కాంగ్రెస్ అదిలాబాద్ లోక్ సభ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమిస్తూ.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అల్మాస్ ఖాన్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్‌లో తాను 8 సంవత్సరాలుగా ఆయా పదవులు చేపట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా సేవలందించడం జరుగుతున్నదని చెప్పారు.
తనకు ఈ స్థాయి గౌరవం ఇచ్చి లోక్ సభ ఎన్నికల అదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా అవకాశం కల్పించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పదవికి న్యాయం చేయడమే కాకుండా పార్టీ పరమైన ఆదేశాలు సూచనలను పాటిస్తూ.. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి.. కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలను వివరించడమే కాకుండా చేసిన విద్య, వైజ్ఞానిక సామాజిక పరమైన అభివృద్ధి విషయాలను అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు.