బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ముఖ్యమంత్రి ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయ పార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?’ అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు.
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని, తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు.