ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచి స్వాములు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. అయితే, గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు.. కానీ, జనసేన అధిష్టానం ఆయనకు చీరాల భాద్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడు చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.