Trending Now

అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేయాలి..

మంత్రి సీతక్కకు వినతిపత్రం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : నిర్మల్ జిల్లాకు వచ్చిన అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క ను అంబేద్కర్ యువజన సంఘం నేతలు కలిసి అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలోని దివ్య నగర్ అయ్యప్ప గుడి ముందరి భాగంలో గల 534 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిని కాపాడాలని.. ఆ ప్రభుత్వ స్థలంలో జిల్లాలోని నిరుద్యోగులు అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేష్, డీఎస్సీ జిల్లా అధ్యక్షుడు కొంతం మురళీధర్, ఉపాధ్యక్షుడు దామ భూమేష్, పట్టణ అధ్యక్షుడు కత్తి నవీన్, రవి, ఎల్మల రంజిత్, బోర శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News