ప్రతిపక్షం, చేర్యాల మే 1: ‘మే’ డే స్ఫూర్తితో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ పిలుపునిచ్చారు. 138వ ‘మే’ డే ను పురస్కరించుకొని బుధవారం చేర్యాల మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అందే అశోక్ మాట్లాడుతూ.. 8 గంటల పని విధానం కోసం, కార్మిక హక్కుల కోసం ఆనాడు ప్రాణాలర్పించిన చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలు నిర్వహించాలని, నరేంద్ర మోడీ అనుసరిస్తున్నకార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం త్రిప్పికొట్టాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి ప్రాణాల అర్పించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా చేసి కార్మికులను బానిసలు చేసే కుట్ర చేస్తుందని ఈ కుట్రను తిప్పికొట్టేందుకు ‘మే’ డే స్ఫూర్తితో పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
దేశ సంపదను అప్పనంగా తన అణువాయులకు దోచిపెడుతున్న మోడీకి కార్మికవర్గ పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన కొనసాగిస్తున్న బీజేపీకి కాలం దగ్గర పడిందని కార్మికులను ప్రజలను మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, వలబోజు నరసింహాచారి, జంగిలి యాదగిరి, రామగల్ల నరేష్, పొన్నబోయిన మమత, కత్తుల భాస్కర్ రెడ్డి, బంగారు ప్రేమ్ కుమార్, కర్రె ఆంజనేయులు, కుడిక్యాల బాల్ మోహన్, గూడెపు సుదర్శన్, బండారి సిద్దయ్య, నంగి కనకయ్య, గజ్జల సురేందర్, తుప్పతి రాజు, చింతల నరేష్, ముచ్చాల రామకృష్ణ, సుంకరి తిరుపతి, వెలుగల యాదగిరి, వెలగల మురళి, బోయిని రాజు, ఎర్ర అశోక్, దండ బోయిన వెంకటేష్, చిగుళ్ల నరేష్, గడ్డి పరమేష్, బింగి దుర్గయ్య, భాగ్య, రజిత, మల్లవ్వ, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.