Amy Jackson and Ed Westwick Are Now Married: ప్రముఖ హీరోయిన్ అమీ జాక్సన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగులో మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా, ఈ అమ్మడు రెండో పెళ్లి చేసుకుంది. ఇంగ్లిష్ యాక్టర్, మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను ఆమె వివాహం చేసుకుంది. కాగా, వీరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో రిలేషన్ షిప్‌లో ఉన్న ఆమె.. కొద్దిరోజులకే విడిపోయింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లిపీటలు ఎక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది. 2021లో పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు అమీజాక్సన్ ప్రకటించింది.