ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కరావు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పలుమార్లు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి నిరాశ చెందానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అనకాపల్లి నియోజకవర్గ టికెట్‌ను కొణతాల రామకృష్ణకు పవన్ కల్యాణ్ కేటాయించారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ కేటాయించడంపై పరుచూరి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.