ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత నెలలో ఏసీఏపై అతడు చేసిన ఆరోపణల గురించి తెలుసుకునేందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు ఏసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఈ నెల 25న మెయిల్ ద్వారా వచ్చిన ఈ షోకాజ్ నోటీసుకు తాను బదులిచ్చానని హనుమ విహారి పేర్కొన్నారు. తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు NOC అడిగినట్లు తెలిపారు.