Rain Alert to AndhraPradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.