Trending Now

బీఆర్​ఎస్​ లోక్​సభ అభ్యర్థుల ప్రకటన..

కరీంనగర్ – బి వినోద్​, ఖమ్మం నామా..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్​ వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. గత రెండురోజులుగా తెలంగాణ భవన్​లో ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు. కరీంనగర్​స్థానానికి మాజీ ఎంపీ బి.వినోద్​కుమార్​, పెద్దపల్లికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఖమ్మంకు సిట్టింగ్​ నామా నాగేశ్వర్​రావు, మహబూబ్​నగర్​కు సిట్టింగ్​ ఎంపీ మాలోతు కవితను ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. అయితే త్వరలోనే మిగతా లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News