Trending Now

అక్కడ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..!

బీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పిన దిలావర్ పూర్ మండల నాయకులు..

కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ కి నిర్మల్ నియోజకవర్గంలో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇప్పటికే చాలామంది బీఆర్‌ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులంతా కాంగ్రెస్‌లో చేరెందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రస్తుత దిలావర్ పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్ కుమార్, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ కె.రాజేశ్వర్, వైస్ ఎంపీపీ బాపురావు, కదిలి దేవస్థానం చైర్మన్ వెంకట్ రావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు స్వామి గౌడ్, ఆర్. మహేష్ ,తిరుమల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అమృత చిన్నరెడ్డి, న్యూ లోలం సర్పంచ్ ఒడ్నం సవిత కృష్ణ, దిలావర్ పూర్ గ్రామ అధ్యక్షులు డా. రవి, భుజంగా రావు, కదిలి ఉప సర్పంచ్ మారుతి పటేల్, పిఎసిఎస్ డైరెక్టర్ దత్తురం పటేల్ సాంబాజీ పటేల్ నర్సారెడ్డి, మాజీ సర్పంచ్, ఎ.లక్ష్మణ్ సముందర్ పల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆత్మ డైరెక్టర్ సప్పాల రవి తో పాటు మరో ఐదు వందల మందికిపైగా కార్యకర్తలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలో వీరందరూ నిర్మల్ కాంగ్రెస్అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు సమక్షంలో కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరే విషయమై సుమారు నెల రోజులుగా డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావుతో పలు దఫాలు చర్చించడం జరిగింది.

ఇక దిలావర్ పూర్ కూడా ఎగిరేది మూడు రంగుల జెండా..

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు మొత్తం ఒకేసారి పార్టీ మారుతున్నడంతో మండలంలో ”కారు” పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లే అవుతుంది. దిలావర్ పూర్ మండలంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కు మోయలేని రాజకీయ గాయం కాక తప్పదు. ముఖ్య నాయకులతోపాటు గ్రామ స్థాయి శ్రేణులు కూడా రంగు మారుతున్నడంతో అక్కడ ఇక బీఆర్ఎస్ జండా మోసే వారే లేకుండా అవుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపుకు మండలంలో తమదైన రీతిలో కష్టపడి అత్యధిక ఓట్లు పడేలా చూస్తామని వారు ఈ సందర్భంగా భరోసా కల్పించారు.

Spread the love

Related News

Latest News