ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి చెందదు. జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.