Chargesheet Filed on Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో మలుపు తిరిగింది. తాజాగా, పోలీసులు ఈ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య చెబుతున్న విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని, పోలీసులు లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు. మరోవైపు ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, పోలీసుల ఛార్జీషీట్‌పై లావణ్య స్పందించింది. పోలీసులు ఇచ్చిన ఛార్జీషీట్‌పై లావణ్య హర్షం వ్యక్తం చేసింది. పోలీసులు నాకు న్యాయం చేశారని చెప్పింది. ఈ సంఘటనలో ధర్మమే గెలిచిందని వెల్లడించింది. మేము గుడిలో పెళ్లి చేసుకొని కాపురం పెట్టామని, కొంతమంది మమ్మల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా కారణంగా రాజ్ తరుణ్ నన్న వదిలేశాడని చెప్పింది. రాజ్ తరుణ్‌ను వదిలేయాలని మాల్వీని కోరింది.