ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ సోమవారం ఖరారు చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి షర్మిల సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడ-పల్లంరాజు, విశాఖ-సినీ నిర్మాత సత్యారెడ్డి, బాపట్ల-జేడీ శీలం బరిలో దిగనున్నారు.