Trending Now

వాటిపై ప్రత్యేక దృష్టి.. ఏపీ డిప్యూటి సీఎం పవన్‌ కల్యాణ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామని ఏపీ డిప్యూటి సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతామని.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శాఖలు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవని మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగమని.. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటన్నారు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలన్నారు. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News