ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కలయాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జీతం కచ్చితంగా తీసుకుంటా.. అప్పుడే జవాబుదారి తనం ఉంటుంది.. అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన.. గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలివేశా అని ప్రకటించారు.