AP Government Posting for Trainee IAS: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎనిమిది మంది ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 8 మందిని సబ్‌కలెక్టర్లుగా నియమించింది. మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్‌గా సహదిత్ వెంకట్, పాలకొండ – యశ్వంత్ కుమార్, నర్సీపట్నం – కల్పశ్రీ, పెనుకొండ – భరద్వాజ్, గూడూరు – రాఘవేంద్ర మీనా, పాడేరు – శూర్యమాన్ పటేల్, కందుకూరు – తిరుమని శ్రీపూజ, తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ గా సంజనా సిన్హాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.