AP Paddy Procurement: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధాన్యం కొనుగోలు తర్వాత ఆధార్ అనుసంధానమైన ఈ-పంట, ఈ-కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కామన్ వెరైటీ ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,300, గ్రేడ్ ఏ రకం కనీస మద్దతు రూ.2,320 చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ఆపరేషన్ల పర్యవేక్షణనను జిల్లా కలెక్టర్లు, జేసీలను అప్పగించింది.