ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. పరిపాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డోచ్చిందని ప్రశ్నించారు. విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేశారని మండిపడ్డారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్ ఇదే అని సెటర్లు వేశారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరదీయడం నిజం కాదా అని వైఎస్ షర్మిల ఫైరయ్యారు.