ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: టిఆర్ఎస్ యువ నాయకులు నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నమ్ముకున్న బంటు అప్పాల గణేష్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ తీర్థము పుచ్చుకున్నందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారాలు కోన సాగుతుండగా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సూచనలు ఆదేశాల మేరకు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న అప్పాల గణేష్ చక్రవర్తి ముందుగా కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు తన అనుచరులతో రహస్య సమావేశం జరిపినట్లు సమాచారం. విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ జిల్లా రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన అప్పాల గణేష్ చక్రవర్తి మారిన రాజకీయ పరిణామాల కారణంగా గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి ముందుగా మాజీ రాష్ట్రమంత్రి అల్లోల్లతో కలిసి వైయస్సార్సీపి, బీఆర్ఎస్ లలో చేరారు.
2014 స్థానిక సంస్థల ఎన్నికలలో నిర్మల్ పట్టణంలోని ఓ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు. అయితే అప్పాల గణేష్ చక్రవర్తికి మాజీమంత్రి అల్లోల నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అవకాశం కల్పించారు. 2018 లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అప్పాల గణేష్ చక్రవర్తి రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలను బీడీ అప్పటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ పరిస్థితులు పరిణామాల కారణంగా ఆయన ఏలేటిని వీడి బిజెపిలో చేరారు. బిజెపిలో కూడా కొన్నాళ్ల వరకు చురుకైన యువ నాయకునిగా కష్టపడ్డ అప్పాల గణేష్ చక్రవర్తికి ఆ స్థాయి గౌరవం దక్కడం లేదని మనోవేదనతో 2023 శాసనసభ ఎన్నికల కంటే ముందు మళ్ళీ తిరిగి తన రాజకీయ గురువు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి మద్దతుగా నిలిచి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికలలో రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఘోరంగా ఓటమి చెందడంతో మంత్రి అల్లోల క్యాడర్ ఆందోళనలో పడ్డది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అల్లోల మరియు ఆ స్థాయి చురుకుదనము ఇటు రాజకీయంగాను.. అటు సామాజికంగానూ కనిపించకుండా పోయింది. అయితే సుమారు 20 రోజులుగా రాష్ట్ర మాజీ మంత్రి హల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న జోరైన ప్రచారాలకు బలం చేకూర్చేలా నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ముందస్తు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
అప్పాలు గణేష్ తో.. నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ యువ నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు నిర్మల్ పట్టణంతోపాటు మండలం నియోజకవర్గం ఇస్తాయి ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు కాంగ్రెస్ ముందుగా చేరుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా నిర్మల్ పట్టణ స్థాయి ఆయా వార్డుల యువనాయకులు అప్పాల గణేష్ చక్రవర్తితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానవిచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచన మేరకే జరుగుతుందని సమాచారం.