Trending Now

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయండి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం. (పీఓ డబ్ల్యు)రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో గల బస్సు డిపో ముందర ధర్నా చేసి, డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పిఓ డబ్ల్యు )జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు ఎక్కువ ప్రయాణాలు రాక,పోకలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో,బస్సులు కొరత ఏర్పడడంతో ఉన్నబస్సుల్లో కిక్కిరిసిపోయిన జనంతో తల్లడిల్లి, ఊపిరి ఆడక సొమ్మసిల్లి పోతున్నారని తెలిపారు.వృద్ధులు వికాలాంగులు చంటిపిల్ల తల్లులు ,పురుషులు బస్సుల్లో ఎక్కువ రద్దీ ఉండడంతో సీట్లు దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని,కొన్ని సందర్భంలో సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.చివరికి ఆర్టీసీ ఉద్యోగులపై కూడా అసభ్యకరమైన మాటలు దాడులు కూడా జరుగుతున్నాయని దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కు ముందు రోజుకు సగటున 45 లక్షల ప్రయాణికులు ప్రయాణం చేస్తే ఇప్పుడు సగటున 55 లక్షల మంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారని వీటికి సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని బస్సులతో పాటు కొత్త ఉద్యోగాలు కూడా కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగుల మీద పని భారం, పడుతుంది .ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఉన్న బస్సుల్లో కూడా కెపాసిటీ, పరిమితికి మించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారని ఊపిరాడని పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. వెంటనే కొత్త బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కె. రాజన్న, గంగామణి లక్ష్మి, కవిత, విజయ, వసంత, తహెసీన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News