Trending Now

కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు..!

ప్రతిపక్షం, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబంలో ఇటీవల ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకరు అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్న రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో ఆయనను పోలీసులు రిమాండ్ చేయనున్నారు. హై కోర్టులో కన్నారావు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం కన్నా రావు ప్రయత్నం చేశాడు. మనేగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు కన్నారావు అండ్ గ్యాంగ్ యత్నించింది. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యారు. కన్నారావు కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కన్నారావుపై147, 148, 447, 427, 307, 436, 506, r/w149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఓ భూఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావు సింగపూర్‌ పరారైనట్టు కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడ పరిధి సర్వే నంబర్‌ 32లో ఉన్న 2.15ఎకరాలకు సంబంధించిన భూవివాదంపై ఓఎ్‌సఆర్‌ ప్రాజెక్ట్స్‌ డైరక్టర్‌ శ్రీనివాస్‌ ఈ నెల 3న ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కన్నారావు ప్రధాన అనుచరుడు డేనియల్‌ సహా ఎనిమిది మందిని ఇప్పటిదాకా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో జక్కిడి సురేందర్‌రెడ్డి, జక్కిడి హరినాథ్‌, కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావు, శివ, డేనియెల్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్లలో నలుగురిని ఇప్పటికే రిమాండ్‌ చేశారు. అయితే, తనపై ఆదిభట్ల పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కన్నారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఆ సమయంలో కన్నారావు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న డేనియల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం కన్నారావు సింగపూర్‌ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కల్వకుంట్ల కన్నారావును పట్టుకునేందుకు అప్పటి నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఎట్టకేలకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

Spread the love

Related News

Latest News