ప్రతిపక్షం, అంతర్జాతీయం: చైనాలోని ఓ నివాస భవనంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగగా 15 మంది మృతి చెందగా.. 44 మంది గాయపడ్డారు. తూర్పు చైనా యుహువాటై జిల్లాలోని నాన్జింగ్ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బిల్టింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించినట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు 25 ఫైర్ ఇంజన్లను మోహరించింది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు నగర మేయర్ చెన్ జిచాంగ్ తెలిపారు.