Trending Now

లోక్ సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్ లో ముమ్మరంగా తనిఖీలు

ప్రతిపక్షం, హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో బాగంగా హైదరాబాద్ జిల్లాలో మొదటి రోజున పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ శాఖ ద్వారా 1,46,350 రూపాయల విలువ గల వస్తువులను సీజ్ తో పాటు.. 9.11లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరి అరెస్టు చేయడమే కాకుండా ఇద్దరి వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జి హెచ్ ఏంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయుటకు యస్ యస్ టి, ఎఫ్ యస్ టి బృందాలు, పోలీస్ శాఖ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజక వర్గానికి ఉదయం ఆరు టీమ్ రాత్రి మరొక 6 టీమ్ ప్రస్తుతం ఏర్పాటు చేసినట్లు, అతి త్వరలో నియోజక వర్గానికి మరొక మొత్తం 9 టీమ్ లు 3 షిఫ్ట్ లలో 24 గంటల పాటు తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Spread the love

Related News

Latest News