నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లా లోని బీఆర్ఎస్ పార్టీ కి చెందిన మేడిపల్లి మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత ఆత్మ డైరెక్టర్ రాజుల నారాయణ, వార్డ్ సభ్యులు గణిమిల సయేందర్, పడిగెల గంగయ్య, బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బుధవారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు సమక్షంలో నిర్మల్ మండల పార్టీ అధ్యక్షులు కుంట వేణుగోపాల్, మేడిపల్లి తాజా మాజీ సర్పంచ్ కుంట పద్మాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సుగుణ గారిని బారీ మెజారిటీ తో గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాల కాలంలో కుటుంబ పాలనలో విసిగిపోయిన బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు.