మహిళగా అభ్యర్థిస్తున్న చేతి గుర్తుకే ఓటు వేయండి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మంగళవారం ఉదయం నుంచే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ధని, బోరిగాం, సాయి నగర్ తండా ,జామ్ ,స్వర్ణ గ్రామాలలో తిరుగుతూ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పరిసరాలలో మండుటెండలలో కూలి పని చేస్తున్న కూలీలను కలిసి తనను తోటీ మహిళా అభ్యర్థిగా గుర్తించి కాంగ్రెస్ చేతు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేసే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని చెప్పారు. దీంతోపాటు మరో ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాబోతుందని ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మహిళలందరికీ సుభిక్షమైన, సుస్థిర పాలన అందుతుందని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ పదేళ్ల ఎన్డీఏ పాలనలో మోడీ మోసపూరిత మాటలే తప్ప అమాయక నిరుపేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్డీఏ పదేళ్ల పాలనలో ఆదాని, అంబానీలే లక్షల కోట్లలో లబ్ధి పొందారని చెప్పారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ నాయకులకు అభివృద్ధి, సంక్షేమం, పేదరికం పట్టదని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరిగే రోజుల దగ్గరలోనే ఉన్నాయని డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. సారంగాపూర్ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏవిధంగానైతే అమలు చేస్తున్నామో అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కచ్చితంగా రాహుల్ గాంధీ వీటిని అమలు చేసి అర్హులైన వారందరికీ వాటి ద్వారా లబ్ధి చేయకూడదా కఠినమైన రీతిలో చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల మేనిఫెస్టోను ఒక్కొక్కరిగా ఓటర్లకు అవగాహన కల్పించి పంచారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, నాయకులు కొట్టే శేఖర్, సారంగాపూర్ ఎంపీపీ ఆడే సవిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజీ నర్సయ్య,సారంగాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, గాజుల రవి, కొంతం గణేష్, బురాజ్, అరవింద్ కుమార్, వెంకట్ రమణరెడ్డి, విలాస్ రావు తేజ్ నాయక్ సత్యపాల్ రెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెల్లి సురేందర్, సింగం బోజా రెడ్డి ,నవీన్ రెడ్డి, దినేష్, ముఖ్త్యార్ ఎంబరి గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి ,రాజేశ్వర్, అదీ, నారాయణ, మహిపాల్, జగదీశ్వర్, రేగుంట గంగాధర్ ,సాయికృష్ణ గౌడ్, ప్రశాంత్ ఓలాత్రి నారాయణ రెడ్డి, పిల్లి నాగయ్య భీం రావు, సయ్యద్ సలీం మారుతి, అబ్దుల్ హాది తదితరులు పాల్గొన్నారు.