Padi Kaushik Reddy house attack: కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెకపూడి గాంధీ అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు మధ్య తోపులాట జరిగింది. అనంతరం గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఇరు పార్టీల నేతలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ నేపథ్యంలో అరెకపూడి గాంధీని విడిచిపెట్టేది లేదని, చర్యకు ప్రతిచర్య తప్పదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారన్నారు. గూండాలు వచ్చి ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అన్నారు. నాపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని, రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారని తొడ కొట్టారు.



























