ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆసీస్ క్రికెటర్ మాథ్యూ వేడ్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతానని వెల్లడించారు. జూన్ లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ జట్టుకు అందుబాలులో ఉంటానన్నారు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేడ్.. ఆరంభంలో కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్ 29.87 సగట్టుతో 1613 రన్స్ చేశారు.