Trending Now

పోలీస్ స్టేషన్ వద్ద ఆటో వాలాల ఆందోళన

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 11 : అకారణంగా ఆటో డ్రైవర్ల పై దాడి చేసి గాయపరిచిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకొని వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని నిర్మల్ ఆటోవాలలు శనివారం ఉదయం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లు ఆటో వాడాలంటే కొంతమందికి చులకనగా ఉందని తమ యూనియన్ ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పట్టణ సీఐ అనిల్ కుమార్ కు ఫిర్యాదు అందజేసిన ఆటో వాలలు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకారణంగా తమ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినమైన రీతిలో శిక్షలు పడేలా చూడాలన్నారు. లేనియెడల తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిర్మల్ పట్టణం తో పాటు పరిసర ప్రాంతాలలో రాత్రింబవళ్లు ప్రజలకు స్థానిక ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న తమ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే దుండగులను అదుపులోకి తీసుకొని చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకొని శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళనలను ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News