ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : మహిళ శిశు వికలాంగులు, వయోవృద్ధుల ట్రాంజెండర్స్ సంక్షేమ శాఖ, స్వీబ్ నోడల్ ఆఫీసర్ డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో స్థానిక డీడబ్ల్యు ఓ ఆఫీస్ లో ట్రాంజెండర్స్ కి ఓటు హక్కు, ఓటు వినియోగం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య డీఆర్‌డీఓ విజయలక్మి, జిల్లా సంక్షేమ అధికారి ఎ. నాగమణి ఇతర సిబ్బంది పాల్గొని ట్రాంజెండర్స్ పార్లమెంటరీ ఇతర ఎలక్షన్స్ లో తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
అందుకుగాను ఓటు హక్కు లేని వారు ఓటర్ నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనీషా ఆధ్వర్యం లో ఇతర ట్రాన్స్ జెండర్స్, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.