ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి ఏప్రిల్ 5: భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మహోన్నతమైనది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సిడివో రాజేశ్వర్, డిఆర్ఓ భుజంగరావ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.