ప్రతిపక్షం, ఎల్బీనగర్ ఏప్రిల్ 5: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త , దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ శుక్రవారం ఎల్బీనగర్, చంపాపేట్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి జగ్జీవన్ రామ్ అందించిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, గోపాల్ ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.