Trending Now

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా నూతన కమిటీ నియామకం..

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 17: బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో సిద్దిపేట లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షు కటికల ఒం ప్రకాష్ ఆధ్వర్యంలో నూతనజిల్లా కమిటీ నాయకులను నియమించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈర్ల మల్లేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శంకర్ ఎనగందుల, జిల్లా కోశాధికారిగా జింక సంజీవ్, జిల్లా సంఘటన మంత్రిగా కొండోనల్ల నరేష్, జిల్లా ఈసీ మెంబర్లు గా కథ మహేష్, మైల తిరుపతి, జోడు ముంత నవీన్, ఆశని కనక ప్రసాద్ లను నియమించడం జరిగింది.

రానున్న పార్లమెంటు ఎలక్షన్ లను గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని బహుజన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతూ ఫూలే, అంబేద్కర్ , కాన్సిరాం ల సిద్ధాంతాన్ని గ్రామ గ్రామీణ విస్తరించాలని ఈ సందర్భంగా వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వివిధ అసెంబ్లీ మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పుల్లూరు ఉమేశ్, రామనకర్, వినోద్, రాజు, డేగల వెంకటేష్, తిరుపతి, శ్రీనివాస్, నవీన్, శరత్, సాయి తేజ, బాను, మహేష్, బాను, కిరణ్, లింగం స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News