ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పచ్చి అవకాశవాది అని బీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. గురువారం అయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు.పదేళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి అన్ని విధాల ప్రయోజనాలు పొందిన మాజీమంత్రి అల్లోల బీఆర్ఎస్ కు ద్రోహం చేశారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్ర మంత్రిగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు అధికారం కోల్పోయాక పార్టీ మారడం సిగ్గుచేటు అన్నారు. నిర్మల్ ప్రజలు రాజకీయ అవకాశవాదినైన మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.