Trending Now

రేపు కేజీ టు పీజీ విద్యాసంస్థలు బంద్..

నీట్ యూజీ విద్యార్థులకు న్యాయం చేయాలి

ప్రతిపక్షం, సిద్దిపేట, జూలై 03: నీట్ పేపర్ లీకేజి మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం బంద్ విజయవంతం కోరుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ బాద్యులకు కలిశారు. అనంతరం పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పీడీఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్, ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె కుమార్, ఎన్.ఎస్.యు.ఐ,ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు అజ్మత్ ,రంజిత్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పత్రాలు లీకేజి చేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటం ఆడిందని, దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్నప్పటికీ దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సుమారు డెబ్బై పరీక్ష,ప్రవేశ పరీక్షల పేపర్స్ లీకేజీ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పరీక్ష నిర్వహణలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విద్యార్థులకు బహిరంగ క్షమపణ చెప్పాలన్నారు. నీట్ నిర్వహణంలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ పరీక్షను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోచింగ్ సెంటర్లు పేరుతో కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అమనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ కి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జులై 4న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ, ఏ.ఐ.ఎస్.ఎఫ్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు ప్రసన్న కుమార్ ,కొండం సంజీవ్, ర్యాషద్,అభి,భరత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News