ప్రతిపక్షం, హుస్నాబాద్ : మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై చేసిన కామెంట్స్ కు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్న.. అమ్మా నేను నిన్ను కించపర్చేలా ఒక్క మాట కూడా అనలేదని.. మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని.. ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ కామెంట్స్ హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో ఆయన చేశారు. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడని.. మీ పేరును రాజకీయంగా వాడుకుంటూ.. మానసిక క్షోభకు గురి చేస్తున్నడన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్నారు.