ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు ఇప్పటికే మీ మీద విసుగుతో ఉన్నారని.. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను ఖండిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ మహేశ్వర్ రెడ్డిపై ఆయన ఈ వీడియోలో మండిపడ్డారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసి బీజేపీ వాళ్లను మేనేజ్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వర్ రెడ్డి గారిది అన్నారు. ఆయనకంటే సీనియర్ రాజాసింగ్ లాంటి వాళ్లు ఉన్న కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు అంటే అర్థమవుతుంది లాబింగ్ చేసుట్ల మహేశ్వర్ రెడ్డి దిట్ట అని అన్నారు. టాక్స్ లు గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి లాగా మహేశ్వర్ రెడ్డి కనిపిస్తున్నాడు. భారతదేశంలో తెలంగాణ నుంచి బీజేపీ పార్టీలో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని వారి జాతీయ నాయకత్వం ఆకర్షించాలని ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అన్నారు.
గౌరవ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారిని ‘యూ’ టాక్స్ పేరుతో విమర్శించడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా గాని మనం ప్రజల ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటది. నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చారు బీజేపీ వాళ్లు.. చాలా సంతోషం ఏదో సాధించాలన్న ఆలోచనతోనే ఏది పడితే అది మాట్లాడకూడదని అన్నారు. గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విఫలమయ్యారు. మీకు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుని హోదా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అసత్య ఆరోపణలు అడ్డదిడ్డంగా మాట్లాడడం.. ప్రజలను తప్పుదోవ పట్టించడం, గందరగోళానికి గురి చేయడం వలన ప్రజలు రాబోయే రోజుల్లో మిమ్ములను నమ్మరు నమ్మే పరిస్థితిలో కూడా లేదు.
ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాదని తెలిపారు. రూ. 500 బోనస్ అనేది, ఆరు పథకాలు క్లిస్టర్ క్లియర్‌గా అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. మీరు.. మీ పార్టీ నాయకులు ప్రజలకు విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన గ్యారెంటీలు అన్ని అమలు చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చేసిన అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మీరు పార్లమెంట్‌లో జీరో, స్థానిక సంస్థలలో కూడా జీరో కాబోతున్నారు. ఇవి తట్టుకోలేక ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయినా హరీష్ రావు గారు పవర్ లేకుండా ఉండలేకపోతున్నాడు. అధికారం లేక నిద్ర పడతలేదని మండిపడ్డారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రవర్తించండి.. గానీ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆందోళనకు గురి చేయకండి. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మీ మీద విసుగుతో ఉన్నారు. మంచి ఏంది.. చెడు ఏంది.. అనేది ప్రజలకు తెలుసు.. వారు గమనిస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా వాళ్లు నమ్మే పరిస్థితిలో లేరు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.