ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల్లో పొందుపరిచిన వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. కాగా, గ్రూప్-1కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.