ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్ లైన్ లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తులు లక్షల్లో..
ఇప్పటికే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష కోసం మొత్తం 2లక్షల 83వేల 441 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99వేల 210 మంది నుంచి అప్లికేషన్లు రాగా, పేపర్-2కు 1లక్షా 84వేల 231 మంది దరఖాస్తు చేసుకున్నారు.