కుటుంబ సమేతంగా సొంతగూటికి చేరుకున్న బీఆర్ఎస్ ఇంచార్జ్
ప్రతిపక్షం, ఎల్బీనగర్ ఏప్రిల్ 13 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జూబ్లీ హిల్ల్స్‌లోని సీఎం నివాసం నందు జరిగిన కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , బీఆర్‌ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, మాజీ జీహెచ్‌యంసీ కో-ఆప్సన్ సభ్యురాలు మల్లారపు షాలిని తదితరులున్నారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు, జోగు రాములు, ముద్దగౌని రంజిత్ గౌడ్, ముద్దగౌని మనీష్ గౌడ్, వెంకట కృష్ణ, నగేష్ గౌడ్, శంకర్, ఉషారాణి, చరణ్, సాయి తదితరులున్నారు.