ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు.గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కే. కేశవ రావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు.తన కూతురు, హైదరాబాద్ మేయర్ జీ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు.