కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు..
ప్రతిపక్షం, హైదరాబాద్ స్టేట్ బ్యూరో: మహేశ్వర్షం నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు భారీ ఎత్తున షాక్ తగిలింది. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ సమక్షంలో కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆకుల అరవింద్ తో పాటు 150 మంది బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్, శుశీల రెడ్డి, కొండల్ రెడ్డి, అంకిరెడ్డి, రిషి, లక్ష్మీనర్సింహా రెడ్డి, సుదమా, సలీం, ఇస్మాయిల్, జహీర్, నరేష్ గౌడ్,. యశ్వంత్ రెడ్డి, రాజేష్ గౌడ్, గోవేర్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.