Eluru Mayor Noorjahan: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 27న మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మేయర్ దంపతులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు మరో 30 మంది కీలక నేతలు పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడేటి బుజ్జి వీరిద్దరినీ టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏలూరు నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా..ఆ ఎన్నికల్లో నూర్జహాన్ విజయం సాధించింది. తర్వాత 2019లో వైసీపీలోకి వెళ్లి రెండోసారి మేయర్ పీఠం దక్కించుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి రావడంతో తిరిగి సొంతగూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.